జ‌గ‌న్‌ను కిమ్‌తో పోల్చ‌డం స‌రికాదుః సీపీఐ నారాయ‌ణ‌

ఏపీ సీఎం జ‌గ‌న్ ను నియంతగా పేరుగాంచిన నార్త్ కొరియా అధ్య‌క్షుడు కిమ్ తో పోల్చ‌డం స‌రికాద‌ని సీపీఐ నారాయ‌ణ అన్నారు.

జ‌గ‌న్‌ను కిమ్‌తో పోలుస్తూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన నారాయ‌ణ‌.జ‌గ‌న్‌కు, కిమ్‌కు న‌క్క‌కు, నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉందని విమ‌ర్శించారు.

అమెరికా లాంటి అగ్ర‌దేశాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన కిమ్ ను ఇలా పోల్చ‌డం స‌రికాద‌ని వ్యాఖ్య‌నించారు.అనంత‌రం హ‌త్యా రాజ‌కీయాల‌ను వైసీపీ ప్రోత్స‌హిస్తోంద‌ని ఆరోపించారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement