పిరియడ్స్ గాడితప్పడానికి కారణాలు

చాలామంది అనుకున్నట్లు పీరియడ్స్ కేవలం పెళ్ళి చేసుకున్న స్త్రీలలోనే గాడి తప్పవు.ప్రెగ్నెన్సి లేని సమయంలో, ఎప్పుడైనా కొన్ని కారణాల వలన ట్రాక్ తప్పొచ్చు.

ఇలా జరుగుతోంటే మాత్రం ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా, ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా డాక్టర్ ని సంప్రదించాలి.ఇక పిరియడ్స్ లయ తప్పడానికి సాధారణ కారణాలేంటో చూద్దాం.

* అతి ప్రధాన కారణంగా హార్మోన్లలో సమతుల్యత లోపించడాన్ని చెప్పుకోవచ్చు.ఈ హార్మోన్లు బ్యాలెన్స్ తప్పడానికి కూడా ఆహారపు అలవాట్లు, నిద్ర అలవాట్లు, ఇతర లైఫ్ స్టయిల్ పద్ధతులు కారణమవుతాయి.

* ఒత్తిడికి బాగా గురైతే కూడా అది పీరియడ్స్ పైన ప్రభావం చూపుతుంది.నిజానికి ఒత్తిడి అనేది పీరియడ్స్ కి బద్దశతృవు.

Advertisement

హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడానికి చాలా కామన్ రీజన్ ఒత్తిడి.* ఒక్కసారిగా లావెక్కినా, లేదా ఒక్కసారిగా బరువు తగ్గినా, అది శరీరంలోని కొవ్వు శాతంపై చాలా పెద్ద ప్రభావం చూపుతుంది.

దాంతో పీరియడ్స్ గాడి తప్పుతాయి.* మంచి ఆహారం తీసుకోవడం ఎవరికైనా అవసరమే.

మరీ ముఖ్యంగా స్త్రీలు ఓ వయసులోకి వచ్చక సరైన ఆహారపు అలవాట్లు లేకపోతే అనోరెక్సియా, బులుమియా లాంటి డిజార్డర్లు రావొచ్చు.ఇదే జరిగితే పిరియడ్స్ క్రమం తప్పడం ఖాయం.

* వినడానికి వింతగా ఉన్నా, ఆడవారు అతిగా వ్యాయాం చేసినా, అది హార్మోన్‌ల బ్యాలెన్స్ ని దెబ్బతోస్తుంది.అందుకే వ్యామంగా మితంగా ఉండాలి.

ఆర్జీవీని పటాయించే క్రమంలో వంశీ నాపై కుట్రలు చేశాడు- జేడీ చక్రవర్తి
Advertisement

తాజా వార్తలు