Skanda SVSC: స్కంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో అది కామన్.. ఏంటో తెలిస్తే..

రామ్ పోతినేని( Ram Pothineni ) హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ స్కంద.

( Skanda ) సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే మిశ్రమ స్పందన వచ్చింది.

ఈ సినిమాను సోషల్ మీడియాలో నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు. స్కంద సినిమాను అన్ని కోణాల్లోనూ ఏకిపారేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ( Seethamma Vakitlo Sirimalle Chettu ) సినిమాకు ఒక కామన్ పాయింట్ ఉందని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.తెలుగు ఇండస్ట్రీలో మాస్‌కి బోయపాటి శ్రీను( Boyapati Srinu ) అంటే కేరాఫ్ అడ్రెస్.

అతను ఇప్పటి వరకు తీసిన 9 సినిమాలూ మాస్ ప్రేక్షకులను మెప్పించాయి.స్కంద సినిమా మాస్‌కి మరింత మాస్‌గా ఉంది.

Advertisement

బోయపాటి సినిమాలలో లాజిక్ అనేది వీసమెత్తు అయినా ఉండదు.హీరో ఎంత పెద్దవాడినైనా అయినా సులభంగా కొట్టగలడు.

స్కందలో అయితే హీరో మరింత బలవంతుడిగా చూపించాడు.మాస్ ప్రేక్షకులు ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్‌కి ఈలలు వేశారు.

కానీ, సాధారణ ఆడియెన్స్‌కు అవి చాలా బోరింగ్ గా, సిల్లీగా అనిపించాయి.దీంతో, సోషల్ మీడియాలో ఈ సినిమాను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.

ఇక స్కంద లాంటి మాస్ సినిమాకి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాస్ సినిమాకి ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటో తెలుసుకుంటే.ఈ రెండు సినిమాలలో క్యారెక్టర్లకు నేమ్స్( Character Names ) ఉండవు.కోతిమీర.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

కట్ట అనే ఇన్‌స్టా అకౌంట్ ఈ కామన్ పాయింట్ ను పట్టేసింది, స్కందలోని రామ్, శ్రీలీల, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలోని వెంకటేష్,( Venkatesh ) మహేష్ బాబు( Mahesh Babu ) ఫోటోలను షేర్ చేస్తూ."వీళ్ళ పేర్లు ఏంటో చెప్పండయ్యా" అని సదరు అకౌంట్ ఫాలోవర్లని ప్రశ్నించింది.

Advertisement

కానీ ఎవరూ చెప్పలేకపోయారు.ఎందుకంటే ఆ రెండు సినిమాల్లోనూ హీరోలకు పేర్లు లేవు.స్కంద మూవీలో రామ్ ని సీఎం అల్లుడు, శ్రీలీలను సీఎం కూతురు, యావరేజ్ అని మాత్రమే అంటారు.

వారికి ప్రత్యేకంగా పేర్లంటూ లేవు.ఇక సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో వెంకటేష్, మహేష్ బాబును పెద్దోడు, చిన్నోడు అంటారే తప్ప వారిద్దరి నేమ్స్ ఎక్కడా వినిపించవు.

బోయపాటి దీని నుంచి ఇన్స్పైర్ అయ్యే అలా పేర్లను ఉంచాడా లేదంటే ఇదొక యాదృచ్చికమా అనేది తెలియాల్సి ఉంది.ఈ పోస్ట్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు