తలనొప్పి తగ్గటానికి చేసే ఈ పనులు...తలనొప్పిని పెంచుతాయా?

సాధారణంగా తలనొప్పి అనేది ప్రతి ఒక్కరికి ఎదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది.

అయితే ఈ తలనొప్పి రావటానికి ఒత్తిడి, హేంగోవర్, నిద్ర సరిలేకుండుట, మైగ్రేన్ వంటివి కారణాలుగా ఉండవచ్చు.

తలనొప్పి వచ్చినప్పుడు బయట పడటానికి అద్భుతమైన సమర్ధవంతమైన ఇంటి ఔషదాలు ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.

సాధారణంగా తలనొప్పి రాగానే కాఫీ త్రాగుతూ ఉంటాం.ఇది నరాల వ్యవస్థను ఉద్రేకపరుస్తుంది.

దీని ప్రభావం దాదాపుగా 5 గంటల వరకు ఉంటుంది.రెండు కప్పుల కాఫీ త్రాగితే తలనొప్పి తాత్కాలికంగా తగ్గిన మరల వచ్చే అవకాశం ఉంది.

Advertisement

అంతేకాక కాఫీని అధికంగా తీసుకుంటే డీహైడ్రేషన్ కు గురవుతుంది.కాబట్టి తలనొప్పి వచ్చినప్పుడు కాఫీ త్రాగటం చెడు అలవాటే అని చెప్పాలి.

ఎంత పనిలో ఉన్నా తలనొప్పి అనిపించగానే ఒక కప్పు టీ త్రాగేస్తూ ఉంటాం.పని ఒత్తిడికి మంచి రిలీఫ్ గా భావిస్తాం.అయితే టీలలో ఒక కప్పు గ్రీన్ టీ త్రాగితే మంచి రిలీఫ్ వస్తుంది.

అయితే ఎక్కువగా త్రాగితే డీహైడ్రేట్ అవటం, అజీర్ణం, యూరిక్ యాసిడ్ ఏర్పడటం వంటివి జరుగుతాయి.తలనొప్పి తగ్గటానికి చాలా మంది చాకోలెట్స్ తింటూ ఉంటారు.

ప్రత్యేకంగా మహిళలు డార్క్ చాక్లెట్ తింటారు.డార్క్ చాక్లెట్ లో వున్న కోకో పౌడర్ రిలీఫ్ ఇస్తుంది కాని అధికంగా ఈ చాక్లెట్ లు తింటే తలనొప్పి పెరుగుతుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20

డార్క్ చాక్లెట్ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.

Advertisement

తాజా వార్తలు