సుధాకర్ చనిపోయాడు అంటూ వచ్చిన వార్తల కు క్లారిటీ ఇచ్చిన సుధాకర్...

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసిన సుధాకర్ ( Comedian Sudhakar ) గత కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు .

సినిమాలతో పాటు సినీ పరిశ్రమకు కూడా సుధాకర్ దూరంగానే ఉంటున్నారు.

కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్య సమస్యలతో( Comedian Sudhakar Health ) బాధపడి చికిత్స అనంతరం తిరిగి కోలుకున్నట్టు సమాచారం.కొన్నాళ్ల నుంచి ఎవరికీ అందుబాటులో లేని సుధాకర్ పై పలు రకాల వార్తలు వస్తున్నాయ్ .కొన్ని సైట్స్ అయితే కమెడియన్ సుధాకర్ చనిపోయారంటూ కల్పిత వార్తలు రాశారు .కొన్ని మీడియా వెబ్‌సైట్లు కూడా సుధాకర్‌ కన్నుమూశారంటూ కథనాలు పబ్లిష్‌ చేశాయి.ఈ నేపథ్యంలో వీటిపై స్పందించిన సుధాకర్‌ తనపై వస్తోన్న అసత్య వార్తలను ఖండించారు.

తాను ఆరోగ్యంగానే ఉన్నానని, చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు.

దయచేసి తప్పుడు వార్తలపు ప్రసారం చేయద్దని విజ్ఞప్తి చేశారు.అందరికీ నమస్కారం.నా మీద వచ్చినవన్నీ అసత్య వార్తలే.

Advertisement

తప్పుడు సమాచారాన్ని నమ్మకండి.అలాంటివి స్ప్రెడ్ చేయకండి.

నేను చాలా సంతోషంగా ఉన్నాను.ఐ యామ్ వెరీ హ్యాపీ అని వీడియోలో చెప్పుకొచ్చారు .తద్వారా ఆయన ఆరోగ్యంపై వస్తోన్న వదంతులకు చెక్‌ పెట్టేశారు.కా సుధాకర్‌పై ఇలాంటి కథననాలు రావడంపై సినీ అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సుధాకర్ ఆరోగ్యం గురించి ఇలాంటి ఫేక్‌ రూమర్స్ రావడం ఇదేమీ మొదటి సారి కాదు.2010లో ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో కోమాలోకి వెళ్లారు.

ఆ సమయంలోనే సుధాకర్ మరణించారని న్యూస్ స్ప్రెడ్‌ అయ్యాయి.అయితే వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ఆయన తిరిగి కోలుకున్నారు.ప్రస్తుతం కూడా సుధాకర్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు.

ఇటీవల దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావుపై( Kota Srinivasa Rao ) కూడా ఇలాంటి రూమర్లు తెగ వైరలయ్యాయి.స్వయానా ఆయనే వీడియో రిలీజ్‌ చేసి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఇక ఇటీవల చనిపోయిన శరత్ బాబుపై కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి.ఆయన చనిపోకముందే కన్నుమూశారంటూ నెట్టింట వార్తలు తెగ వైరలయ్యాయి.

Advertisement

ఇటీవల సుధాకర్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని, హాస్పిటల్ లో చేరారని వార్తలు వచ్చాయి.ఈ వార్తలు వైరల్ అవ్వడంతో డైరెక్ట్ గా సుధాకర్ వాటికి సమాధానమిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు.

తాజా వార్తలు