కమెడియన్ సుబ్బరాజు భార్య ఎవరు.. ఆమె ఏం చేస్తారో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా, విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుబ్బరాజు( Subbaraju ) ఒకరు ఇక ఐదు పదుల వయసుకు చేరువ అవుతున్న తరుణంలో ఇటీవల పెళ్లి( Wedding ) చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

తాజాగా ఈయన పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే సుబ్బరాజు తన భార్యతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు.కానీ ఆమె ఎవరు ఏంటి అని వివరాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు దీంతో సుబ్బరాజు పెళ్లి చేసుకున్న ఆమె ఎవరు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తినా లేకపోతే మరేంటి అనే విషయాల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు స్రవంతి( Sravanthi) .ఈమె డాక్టర్ అని తెలుస్తోంది.అమెరికాలో ఫ్లోరిడాలో ఈమె డెంటిస్ట్( Dentist ) గా పనిచేస్తున్నారు.

ఇక వీరి వివాహం యుఎస్ఏ లోనే చాలా సింపుల్ గా జరిగిందని తెలుస్తోంది.అయితే ఇలా యూఎస్ లో పెళ్లి చేసుకున్న ఈ జంట అతి త్వరలోనే హైదరాబాదులో కూడా సినీ సెలెబ్రెటీల సమక్షంలో రిసెప్షన్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఇక ఈయన తమ పెళ్లి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఎంతో మంది అభిమానులు అలాగే ఇతర సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు చెప్పిన విషయం మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే తనకు విష్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు అంటూ ఈయన మరో ట్వీట్ చేశారు.ఇక సుబ్బరాజు ఖడ్గం సినిమా సమయంలో కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ గా చేరి అనంతరం విలన్ పాత్రలలోను అలాగే కమెడియన్ పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న రాకింగ్ రాకేష్ కేసీఆర్.. ఇక్కడైనా హిట్టవుతుందా?
Advertisement

తాజా వార్తలు