అదీ కమెడియన్ సత్య రేంజ్ అంటే.. డిలీట్ చేసిన సీన్లు రీయాడ్ చేసి మరీ..?

కామెడీ థ్రిల్లర్ మూవీ "మత్తు వదలరా (2019)" ( Mattu Vadalara )సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

రితేష్ రానాకు( Ritesh Rana ) ఇది ఫస్ట్ సినిమానే కానీ దాన్ని చాలా బాగా డైరెక్ట్ చేశాడు.

ఈ చిత్రంలో శ్రీ సింహ, సత్య, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు.అయితే వారందరిలో బాగా హైలైట్ అయింది ఒక సత్య మాత్రమే.

అతని కామెడీకి ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.సత్య ఈ సినిమా కంటే ముందు స్వామి రారా, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అంధగాడు, ఛలో వంటి చాలా సినిమాల్లో బీభత్సమైన కామెడీ పండించి బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక మత్తు వదలరా సినిమా తర్వాత అతడి రేంజ్ మరో స్థాయికి చేరుకుంది.

Comedian Sathyam Range Is In Another Leval , Comedian Sathya, Another Leval, Mat
Advertisement
Comedian Sathyam Range Is In Another Leval , Comedian Sathya, Another Leval, Mat

ఈ సినిమా అతనికి మరింత గుర్తింపు తెచ్చి పెట్టింది.దీని తర్వాత ఆయన బిజీయస్ట్ కమెడియన్‌గా మారిపోయాడు.సాధారణంగా మనం బ్రహ్మానందం ముఖం చూడగానే ఆటోమేటిక్ గా నవ్వేస్తాం.

అలా సత్య( Satya ) ముఖం చూడగానే ఇప్పుడు అందరికీ నవ్వు వస్తోంది.అంత గొప్ప హాస్యనటుడిగా సత్య మారిపోయాడు.

అయితే సత్యలో ఓన్లీ మంచి కామెడీ టైమింగ్ మాత్రమే కాదు.డాన్సింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి.

మత్తు వదలరా సినిమా షూటింగ్ లో ఈ డాన్సింగ్ స్కిల్స్ ప్రదర్శించాడు.పదహారేళ్ల వయసు పాటకు 11 రోజులు ఎంతో కష్టపడి సత్య డాన్స్ నేర్చుకున్నాడు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

సినిమా షూట్ టైంలో డాన్స్ ఇరగదీసాడు.అయితే అలాంటి మంచి డాన్స్ క్లిప్ ని డైరెక్టర్ తీసేశాడు.

Advertisement

సినిమా చాలా లెంత్ అవుతుందని, అది మూవీలో ఎక్కడ అడ్జస్ట్ చేయాలో కూడా తెలియని పరిస్థితి ఉందని డైరెక్టర్ చెప్పాడట.

ఒకవేళ అది మూవీ కథలో పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయినట్లయితే దాని కచ్చితంగా యాడ్ చేసి ఉండేవాడినని అన్నాడట.అయితే సత్య మాత్రం చాలా గోల చేశాడట.అంత కష్టపడి డాన్స్ నేర్చుకొని చేస్తే మీరు ఇలా తీసేస్తారా అని అడిగాడట.

అప్పుడు డైరెక్టర్ "సత్య భయ్యా, మత్తు వదలరా సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా దానికి సీక్వెల్ తీద్దాం.అందులో నీ డాన్స్ వీడియో కంపల్సరిగా పెడదాం" అని నచ్చ చెప్పాడట.

అయితే సినిమా హిట్ కావడం, మత్తు వదలరా పార్ట్‌ 2లో సత్య డాన్స్ వీడియో యాడ్ చేయడం జరిగింది.అందులో అతడు ఎంత బాగా స్టెప్పులు వేశాడో చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

సత్య మామూలోడు కాదని చాలా మల్టీ టాలెంటెడ్ అని కూడా కామెంట్లు చేశారు.మొత్తం మీద ఈ కమెడియన్ కష్టం వృధాగా పోలేదు.డిలీట్ చేసిన వీడియో రీయాడ్ చేయడం వల్ల సత్య రేంజ్ ఏంటో కూడా తెలిసిపోయింది.

తాజా వార్తలు