కమెడియన్ హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమంలో ఇన్ని కష్టాలను అనుభవించారా?

హైపర్ ఆది పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పరిచయమైనటువంటి హైపర్ ఆది ప్రస్తుతం వరుస సినిమాలు ఇతర బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా హైపర్ ఆది ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతూ ఇలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నారు అంటే అది కేవలం జబర్దస్త్ వల్ల మాత్రమే అని చెప్పాలి.ఎలాంటి ఉపాధి లేక ఉద్యోగాల కోసం వేట మొదలుపెట్టిన హైపర్ ఆదికి జబర్దస్త్ కార్యక్రమం అవకాశాన్ని కల్పించింది.

ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఈయన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుని సెలబ్రిటీగా మారిపోయారు.

ఇకపోతే ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ ఇతర షోల ద్వారా మల్లెమాలవారు హైపర్ ఆదిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.అయితే ప్రస్తుతం మల్లెమాల వారి కార్యక్రమాలకు హైపర్ ఆది ప్రధానం కాగా కెరియర్ మొదట్లో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పాలి.జబర్దస్త్ కార్యక్రమంలో అదిరే అభి టీంలో కమెడియన్ గా నటిస్తున్న హైపర్ ఆది అసలు తాను తెరపై కనిపిస్తారా లేదా అనే విధంగా ఎదురు చూడాల్సిన పరిస్థితిలో ఉండేవని తెలుస్తోంది.

Advertisement

కెరియర్ మొదట్లో హైపర్ ఆదికి మల్లెమాలవారు కనీసం రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేవారు కాదట కేవలం భోజనం పెట్టి తనని పంపించేవారని మరికొన్నిసార్లు భోజనం కూడా పెట్టకుండా అన్నపూర్ణ స్టూడియోలోకి నిన్ను రానివ్వడమే ఎక్కువ అంటూ తనని హేళనగా మాట్లాడారని తెలుస్తోంది.ఇలా ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలబడిన హైపర్ ఆది ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోనే టాప్ కమెడియన్ గా గుర్తింపు పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా ఈయన కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమాలో నటించారు.

ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

తాజా వార్తలు