అమెరికా లో పెను విషాదం : ముగ్గురు నల్గొండ జిల్లా విద్యార్థుల దుర్మరణం

అమెరికాలోని టెనసీ శివార్లలోని మెమ్ఫిస్‌ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్‌నాయక్‌, సుజాత దంపతుల పిల్లలు ముగ్గురు మరణించారు.గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్‌నాయక్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కేతావత్‌ సాత్విక నాయక్‌ (16), కేతావత్‌ జయ సుచిత్‌ (13), కుమారుడు సుహాన్‌ నాయక్‌ (14) ముగ్గురు అగ్ని ప్రమాదములో ఒకేసారి మరణించటంతో విషాదం అలముకుంది.

శ్రీనివాస్‌నాయక్‌ క్రైస్తవ మతం స్వీకరించి గత కొన్ని ఏళ్లుగా మత బోధనలు చేస్తున్నారు.అందులో భాగంగానే అమెరికాలోని కుదిరియేట్‌(కాలర్‌విల్‌ బైబిల్‌ ) చర్చిలో పనిచేసే పాస్టర్‌ డేనియల్‌ కౌడ్రెట్‌తో సహాయముతో ముగ్గురు పిల్లలను చదువు నిమిత్తం అమెరికా కు పంపారు ,ఇప్పుడు హాలిడేస్ కావడముతో క్రిస్మస్ సెలెబ్రేట్ చేసుకోవటానికి కౌడ్రెట్‌ ఇంటికి వెళ్లారు.

పండగ సంబరాలలో ఉండగా షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదము జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.ఇంటిలోని ఫైర్ అలారమ్స్ పని చేయకపోవటం ,ఫైర్ అత్యంత తొందరగా వ్యాపించటంతో ఇంటిలో వున్న పాస్టర్‌ భార్య కారీ కౌడ్రెట్‌ ముగ్గురు పిల్లలు మరణించారు.పాస్టర్‌ డేనియల్‌ కౌడ్రెట్‌ మరియు కుమారుడు స్వల్ప గాయాలతో చికిత్స తర్వాత హాస్పిటల్ డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తుంది.