కామారెడ్డి మాస్టర్ ప్లాన్‎పై కలెక్టర్ వివరణ

కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన మాస్టర్ ప్లాన్‎పై జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు.మాస్టర్ ప్లాన్‎పై అందరి అభ్యంతరాలు తీసుకుంటున్నామని చెప్పారు.

అభ్యంతరాల స్వీకరణకు ఇంకా 60 రోజులు పూర్తి కాలేదని తెలిపారు.ఈ క్రమంలో మాస్టర్ ప్లాన్‎పై కొందరు అభ్యంతరాలు తెలిపారన్న కలెక్టర్ ఇప్పటివరకు 1026 అభ్యంతరాలు వచ్చాయన్నారు.

ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని స్పష్టం చేశారు.రైతుల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు.

ముసాయిదాలో మార్పులు, చేర్పులు జరుగుతాయన్నారు.జనవరి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు.

Advertisement

భూములు పోతాయని రైతులు ఆందోళన చెందొద్దని వెల్లడించారు.

సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!
Advertisement

తాజా వార్తలు