జొమాటో నుంచి ఆర్డర్ పెట్టిన బిర్యానీలో బొద్దింక.. షాక్ అయిన హైదరాబాదీ కస్టమర్..

కరోనా నుంచి ఫుడ్ డెలివరీ యాప్స్ పై ప్రజలు ఆధారపడటం ఎక్కువైంది.ఇంట్లోనే ఉండి చాలా మంది ఇప్పుడు రెస్టారెంట్ల నుంచి భోజనం తెప్పించుకుంటున్నారు.

కానీ ఆ ఆహారాల్లో కీటకాలు, పురుగులు, ఇంకా అపరిశుభ్రమైన పదార్థాలు ఎన్నో వస్తున్నాయి.వీటిని తినడం ఎంత అనారోగ్యకరమో చెప్పే ఆన్‌లైన్ పోస్ట్‌లు తరచుగా వైరల్ అవుతున్నాయి.

కస్టమర్లు తమ వంటలలో బొద్దింకలను( Cockroaches ) కనుగొన్న సందర్భాలు చాలా ఉన్నాయి.ఇటీవల హైదరాబాద్‌లో అలాంటి ఒక సంఘటన జరిగింది, అక్కడ ఒక రెడిట్ యూజర్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బిర్యానీలో చనిపోయిన బొద్దింకను కనుగొన్న భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నారు.

@maplesyrup_411 యూజర్ నేమ్ గల యూజర్ అసహ్యకరమైన ఫుడ్ ఫొటోలు హైదరాబాద్ సబ్‌రెడిట్‌లో పోస్ట్ చేశారు.కోటిలోని గ్రాండ్ హోటల్ నుంచి జొమాటో ( Zomato )ద్వారా ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేసిన వారు రైస్, చేపలతో పాటు ఫుడ్‌లో చనిపోయిన బొద్దింకను చూసి షాక్ అయ్యారు."నేను కోటిలోని గ్రాండ్ హోటల్‌లో జొమాటో ద్వారా ఫిష్ బిర్యానీని ఆర్డర్ చేశా.

Advertisement

చనిపోయిన బొద్దింకతో నాకు ఎక్స్‌ట్రా ప్రొటీన్‌ని హోటల్ సిబ్బంది అందించింది.ఇకపై ఇక్కడి నుంచి ఆర్డర్ చేయను.

రేటింగ్ 0/10." అని కస్టమర్ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచాడు.

పోస్ట్ ఇతర రెడిట్ యూజర్ల నుంచి చాలా దృష్టిని, కామెంట్స్‌ ఆకర్షించింది.వారిలో చాలామంది హోటల్, జొమాటోపై ఫిర్యాదు చేయమని వినియోగదారుకు సలహా ఇచ్చారు.కస్టమర్ అందుకు అంగీకరించారు.

ఇలాంటి హోటల్స్ ను గుర్తుపెట్టుకొని అక్కడ తినకుండా ఉండటమే మంచిదని మరికొందరు అన్నారు.హోటల్ ఫుడ్ వల్ల డబ్బు ఎక్కువ ఖర్చవడమే కాక అనారోగ్యం కూడా కొని తెచ్చుకున్నట్లే అవుతుందని ఇంకొకరు పేర్కొన్నారు.

How Modern Technology Shapes The IGaming Experience
న్యూస్ రౌండప్ టాప్ 20

ఆన్‌లైన్‌లో పంపించే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా వరస్ట్ క్వాలిటీతో వస్తున్నాయని ఇంకొందరు అన్నారు.

Advertisement

తాజా వార్తలు