సెలబ్రిటీస్ సినిమా బాగుందన్నారు..కానీ తక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసారు.! మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా.?

ఓ గ్రామంలోని వ్యక్తులు వారి జీవితాలే కథా వస్తువుగా తీసుకున్న దర్శకుడు వెంకటేష్‌ మహా.ఎక్కడా సినిమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేయలేదు.

సినిమాను పూర్తిగా సహజంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు.కమర్షియల్ సినిమాల్లో లాగా కామెడీ సీన్స్ ఇరికించకుండా లీడ్ క్యారెక్టర్స్‌ ప్రవర్తన నుంచే కామెడీ పండించి ఆకట్టుకున్నాడు.

Co Cancherlam Movie First Day Collections-సెలబ్రిటీస్ స

సినిమాలో స్టార్ కాస్ట్ ఎవరు లేకపోయినా రిలీజ్ కి ముందు నుండే మంచి హైప్ అందుకుంది ఈ సినిమా.రానా దగ్గుబాటి ఈ సినిమా కథ నచ్చి ప్రొడ్యూస్ చేయడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.విడుదలకు ముందే మూవీ లెజెంట్స్ రాజమౌళి, సుకుమార్, క్రిష్, శేఖర్ కమ్ముల, కీరవాణి లాంటి ప్రముఖుల ప్రశంసలను అందుకున్న ఈ మూవీ శుక్రవారం నాడు (సెప్టెంబర్ 7) విడుదలై సక్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి కలెక్షన్లను రాబట్టింది.విశాఖపట్నం దగ్గరల్లో ఉన్న ‘కంచరపాలెం’ అనే ఊరు నేపథ్యంలో తెరకెక్కించిన వాస్తవ కథే ‘C/o కంచరపాలెం’ ఈ చిత్రంలో నటించిన సుబ్బారావు, రాధ బెస్సీ, కేశవ కర్రీ, నిత్య శ్రీ, కార్తీక్‌ రత్నం, విజయ ప్రవీణ, మోహన్‌ భగత్‌, ప్రణీత పట్నాయక్‌ తదితర పాత్రదారులందరూ కంచరపాలెం వాసులే కావడం.పైగా వాళ్లందరూ కొత్తవాళ్లే కావడం ఈ సినిమాలో మరో విశేషం.

ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.‘సిల్లీ ఫెలోస్, మను’ చిత్రాలు నిరాశపరచడంతో ప్రేక్షకులు ‘C/o కంచరపాలెం’ వైపుకే మగ్గుచూపిస్తున్నారు.

Advertisement

దీంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.అయితే ఈ సినిమా తక్కువ థియేటర్స్‌లో మాత్రమే విడుదల చేయడంతో శని, ఆదివారాల్లో మరిన్ని థియేటర్స్ పెంచే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్.

ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు, నార్త్‌ ఇండియాలోనూ, యూఎస్‌లో కూడా విడుదలైంది ‘C/o కంచరపాలెం’.ఈ సినిమా మొదటిరోజు 25 లక్షలు వసూలు చేసింది.అందులో 3.5 లక్షలు హైదరాబాద్ నుండే.! .

Advertisement

తాజా వార్తలు