వేలేరుపాడులో సిఎం పర్యటన...

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఈరోజు పర్యటించనున్నారు.

ఇందుకోసం జిల్లా యంత్రాంగం విస్త్రృత ఏర్పాట్లను చేసింది.

సి.యం.పర్యటన వివరాలు.ఉదయం 11.00 గంటలకు ఏఎస్ఆర్(అల్లూరి సీతారామరాజు జిల్లా) జిల్లా చింతూరులోని ఏపి టిడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల నుండి హెలీకాప్టర్ లో బయలుదేరతారు.11.30 గంటలకు వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు.11.30 గంటల నుండి 11.40 గంటల వరకు కన్నాయిగుట్ట హెలీప్యాడ్ వద్ద ప్రజాప్రతినిధులను కలుసుకుంటారు.11.45 గంటలకు కన్నాయిగుట్ట హెలీప్యాడ్ నుండి రోడ్డుమార్గం ద్వారా కన్నాయిగుట్ట గ్రామానికి చేరుకుంటారు.11.45 గంటల నుండి 12.15 గంటల వరకు వరద ముంపు ప్రభావిత ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు.అక్కడ నుండి బయలుదేరి 12.20 గంటలకు వ్యూ పాయింట్ ను చేరుకుంటారు.12.20 గంటల నుంచి 12.50 గంటల వరకు ఫొటో గ్యాలరీని సందర్శించి, కన్నాయిగుట్ట, తిరుమలాపురం, నార్లవరం గ్రామాల వరద బాధితులతో సి.యం.జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు.12.55 గంటలకు బయలుదేరి రోడ్డుమార్గం ద్వారా కన్నాయిగుట్ట హెలీప్యాడ్ ను చేరుకుంటారు.1.05 గంటలకు వేలేరుపాడు నుండి హెలీకాప్టర్ లో బయలుదేరి ముఖ్యమంత్రి తాడేపల్లి చేరుకుంటారు.

Lorem Ipsum Dolor Sit Amet