Juvvaladinne Fishing Harbor : ఏపీలో మత్స్యకారులకు భరోసా.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభం

ఏపీలో మత్స్యకారులకు( Fishermen ) మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.ఈ మేరకు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్( Juvvaladinne Fishing Harbor ) ప్రారంభమైంది.

రూ.289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్( Fishing Harbor ) ను సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు.ఈ క్రమంలో ఓఎన్జీసీ పైప్ లైన్ తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు పరిహారం అందజేశారు.ఇందుకోసం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.161.86 కోట్లను సీఎం జగన్ ( CM YS Jagan )జమ చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మత్స్యకారులకు భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.డీజిల్ సబ్సిడీ రూ.6 నుంచి రూ.9 కి పెంచామన్నారు.గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అందిన సాయం రూ.104 కోట్లు మాత్రమేనని తెలిపారు.

మీ ముఖం గ్లాస్ స్కిన్ లా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..!

తాజా వార్తలు