ఇండియా పేరు మార్పుపై సీఎం స్పందిస్తారు..: మంత్రి కొట్టు

ఇండియా పేరు మార్పు వ్యవహారంపై సీఎం జగన్ స్పందిస్తారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

ప్రతిపక్షాలు ఇండియా పేరు పెట్టుకున్నందుకే ఇండియా పేరు భారత్ గా మారుస్తున్నారని ఊహాగానాలు వస్తున్నాయని పేర్కొన్నారు.

భారత్ అని పేరు మార్చినంత మాత్రాన ఇండియా అని పిలవకుండా ఉంటారా అని మంత్రి కొట్టు ప్రశ్నించారు.తాను ఇండియాలోనూ లేమన్న ఆయన ఎన్డీఏలోనూ లేమని తేల్చి చెప్పారు.

అదేవిధంగా సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు సరికాదని తెలిపారు.అటు చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఐటీ శాఖ తేల్చేసిందని వెల్లడించారు.

అయితే ఐటీ నోటీసుల ద్వారా బయట పడింది ఆవగింజంత అన్న మంత్రి కొట్టు చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమని తెలిపారు.

Advertisement
ఇదేం శ్యాడిజం.. స్కూటీని ఢీ కొట్టడమే కాకుండా అమాంతం ఈడ్చుకెళ్లిన కారు..

తాజా వార్తలు