యూపీఎస్సీ ఛైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ..!

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది.

ఇందులో భాగంగా యూపీఎస్సీ ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది.

రేవంత్ రెడ్డి బృందంలో ఆయనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నారు.ఈ క్రమంలో యూపీఎస్సీ పనితీరు పరిశీలన, పరీక్షల నిర్వహణపై రేవంత్ రెడ్డి బృందం అధ్యయనం చేయనుంది.

ఇప్పటికే కేరళలో పర్యటించిన రాష్ట్ర అధికారుల బృందం అక్కడి యూపీఎస్సీ తీరును పరిశీలించిన సంగతి తెలిసిందే.యూపీఎస్సీ పరిశీలన అనంతరం మధ్యాహ్నం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు.

బియ్యం కొనుగోళ్లు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Advertisement
బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ ‘వాక్యం’ చెప్పుకుంటూ జనాలని ‘గొర్రెల కాపరి దారి’లో నడిపించడమే మేలు?

తాజా వార్తలు