వాటిపై దాడి చేశారో... రేవంత్ రెడ్డి వార్నింగ్

మందిరాల మీద , మజీద్ ల మీద దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) హెచ్చరించారు.

ఇటీవల ముత్యాలమ్మ గుడి పై( Muthyalamma Temple ) దాడి చేసిన వారు పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ వెల్లడించారు.

  శాంతిభద్రతలు తమ చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా ఉండాలని పోలీసులకు సూచించారు.  వివిధ పండుగలు ప్రశాంతంగా జరుపుకోవడంలో పోలీస్ సేవలు మర్చిపోలేనివని రేవంత్ ప్రశంసించారు.

  జీతం కోసం పోలీస్ సిబ్బంది పనిచేయడం లేదని , బాధ్యతాయుతంగా భావించి పోలీసులు సేవలందిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో పోలీస్ ఫ్లాగ్ డే( Police Flag Day ) నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.  నిధి నిర్వహణలో అసువులుబాసి , అమరులైన పోలీసులకు రేవంత్ నివాళులు అర్పించారు.  ఆ తర్వాత ప్రసంగిస్తూ అమరులైన పోలీస్ అధికారులు అందరికీ ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించారు.140 కోట్ల దేశ జనాభా ప్రశాంతంగా ఉంది అంటే అందుకు పోలీసులే కారణమని రేవంత్ కొనియాడారు.రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలంటే పోలీసులు కీలకమని అన్నారు. 

Advertisement

నిరుద్యోగుల సమస్య శాంత్రి భద్రత లేని రాష్ట్రం ఉంటే పెట్టుబడులు రావని   రాష్ట్రం అభివృద్ధికి పోలీసులు( Police ) నిరంతరం శ్రమిస్తున్నందుకు వారికి అభినందనలు తెలిపారు.క్రిమినల్స్ తో పోలీసులు ఫ్రెండ్లీగా ఉండడం కాదని , బాధితులతో ఫ్రెండ్లీగా ఉండాలని రేవంత్ సూచించారు.  క్రిమినల్స్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.

పోలీస్ కుటుంబాల కోసం యంగ్ ఇండియా స్కూల్ ను ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు.వచ్చే అకాడమీ నుంచి విద్యాసంస్థ ప్రారంభిస్తామని తెలిపారు.

నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు.

పోలీస్ సమస్యలు ఏమన్నా నా దగ్గరకు తీసుకువస్తే నేను పరిష్కరిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు.వీర మరణం పొందిన పోలీసు కుటుంబాలకు ఇకనుంచి కోటి రూపాయల నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు.  కానిస్టేబుల్,  హెడ్ కానిస్టేబుల్ కు కోటి రూపాయలు,  సబ్ ఇన్స్పెక్టర్ , ఇన్స్పెక్టర్లకు కోటి 25 లక్షలు , డి.ఎస్.పి , అడిషనల్ ఎస్ పి , ఎస్పీ లకు కోటి 50 లక్షలు ఐపీఎస్ కుటుంబాలకు రెండు కోట్లు ఇస్తామని , శాశ్వతంగా అంగవైకల్యం పొందిన కుటుంబాలకు కూడా నష్టపరిహారం చెల్లిస్తామని,  చనిపోయిన కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

కెనడా : భారత సంతతి యువతి మరణంపై ముగిసిన దర్యాప్తు.. ఏం తేల్చారంటే?
Advertisement

తాజా వార్తలు