CM Revanth Reddy : భద్రాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వేదికగా ఇందిరమ్మ ఇళ్ల నమూనాను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రారంభించారు.

భద్రాద్రి రాములవారి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆడబిడ్డల పేరుతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు.పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లని( Indiramma Houses Scheme ) తెలిపారు.

తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లు ఇవ్వబోతుందని ఆయన తెలిపారు.రాష్ట్రంలోని పేదవారితో కేసీఆర్( KCR ) ఆటలాడుకున్నారని విమర్శించారు.

మొదటి నుంచి ఖమ్మం ప్రజలు కేసీఆర్ ను నమ్మలేదన్నారు.ఈ క్రమంలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని తెలిపారు.అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం( Free Bus ) కల్పిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని వెల్లడించారు.దాంతో పాటు అర్హులైన అందరికీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.

Advertisement
తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!

తాజా వార్తలు