మోడీ కేబినెట్‌లోకి సీఎం రమేష్, బండి సంజయ్?

సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది.

దీంతో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చివరిసారిగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి ఆలోచిస్తున్నట్లు జాతీయ మీడియా నివేదించింది.

 ఫిబ్రవరిలో జరగనున్న యూనియన్ బడ్జెట్‌కు ముందు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని  పలు కథనాల్లో వివరించింది.తాజాగా ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మోడీ కేబినెట్‌లో ఏపీ నుంచి ఒకరికి, తెలంగాణ నుంచి ఒకరికి చోటు దక్కుతుందని ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తోంది. పునర్విభజనలో తెలుగు రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

బండి సంజయ్‌కు కేబినెట్‌ బెర్త్‌ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఇప్పటికే మోడీ కేబినెట్‌లో భాగం కాగా బండి సంజయ్‌కు  ఇస్తే తెలంగాణ నుంచి ఇద్దరు మంత్రి వర్గాల్లో ఉంటారు.

Advertisement

  తెలంగాణ నుంచి బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్  టీ-బీజేపీ అధినేతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

గత రెండేళ్లలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ త్రీవంగా విమర్శిస్తు వస్తున్నారు.మరో ఎంపీ ధర్మపురి అరవింద్ కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 అరవింద్ పేరు కూడా పరిశీలనలో ఉందని అయితే బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే బీజేపీకి లోక్‌సభ ఎంపీలు లేరు. సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో జీవీఎల్ మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న వ్యక్తి అయితే ఇటీవలి రాజకీయ కారణాలతో సీఎం రమేష్‌కు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు