మోడీపై కేసీఆర్ వార్ ! లెక్క‌ల్లేవ్‌... !

జాత‌కాల‌పై న‌మ్మ‌కం, వాస్తుపై ప‌ట్టు, సంఖ్యాశాస్త్రానికి పెద్ద‌పీట వేయ‌డం, ముహూర్తూల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లాంటివి చూస్తే తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇచ్చే ప్ర‌ధాన్య‌త అంతా ఇంతాకాదు.

మిగిలిన విష‌యాల‌కు ఎంత‌టి ప్రాధాన్య‌త ఇస్తారో.

అంతే ప్రాధాన్య‌త జాత‌కాల‌కు ఇస్తారు.సంఖ్యా శాస్త్ర‌ప‌రంగా అనేక జాగ్ర‌త్త‌లుకూడా కేసీఆర్ తీసుకుంటారు.

మ‌రి ప్ర‌ధ‌ని మోడీ జాత‌కం, గ్ర‌హ దుస్థితి కూడా తెలుసుకుని ఉంటారు కదా .మ‌రి అధ్య‌య‌నం చేయ‌కుండానే.మోడీపై యుద్ధం ప్ర‌క‌టించారా ? అనే సందేహం వ్య‌క్తమ‌వుతోంది.  మూహూర్థాలు, జాత‌కాలు అమితంగా న‌మ్మే కేసీఆర్ మోడీపై స‌మ‌ర‌శంఖం పూరించ‌డం అస‌క్తిక‌రంగా మారింది.

ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోడీకి తిరుగు లేద‌ని జాత‌క పండితులు ఒక్కానించి చెబుతున్నారు.మోడీ జాత‌క రీత్యా గ్ర‌హాలు, న‌క్ష్ర‌త్రాల క‌ద‌లిక‌ల ప్ర‌కారం మోడిని ఎదుర్కునే శ‌క్తే లేద‌ట‌.

Advertisement

ఎవ‌రైనా స‌రే ఆయ‌న‌ను ఢీకొట్టాల‌నుకుంటే చిత్త‌వుతార‌ని చెబుతున్నారు.మోడీ గ్ర‌హాలు ర‌వి, శుక్ర‌, శ‌ని, కుజ‌, చంద్ర గ్ర‌హాలు ఉచ్చ‌స్థితిలో ఉన్నాయ‌ని, ఆయ‌న ఘ‌న విజ‌యం సాధించ‌డం త‌థ్యమ‌ని వెల్ల‌డిస్తున్నారు.

మోడీకి వ్య‌తిరేకంగా నిలిచినా. ఇత‌రుల‌తో జ‌త క‌ట్టినా స‌రే ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు.

ఇక సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో హ్యాట్రిక్ కొట్ట‌డం మోడీకే సాధ్య‌మ‌న్నారు.ముచ్చ‌ట‌గా మూడోసారి మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అభిప్రాయం వ్య‌క్తంచేస్తున్నారు.

మొత్తంగా ప్ర‌ధాని మోడీకి గ్ర‌హాల బ‌లం మెండుగా ఉంద‌ని, కేంద్రంలో మోడీ జ‌య‌కేత‌నం ఖాయ‌మ‌ని అంటున్నారు.మోడీని ఎంత ఢీకొట్టినా, యుద్ధం చేసినా మోడీకీ ఏమీ కాద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.మ‌రి జ్యోతిష్య పండితులు సంఖ్యాశాస్త్రం, గ్ర‌హాల బ‌లం ప‌రంగా లెక్క‌లేసి మ‌రీ చెబుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం మోడీపై యుద్దం ప్ర‌క‌టించ‌డం , ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌డం చ‌ర్చ‌ణీయాంశంగా మారింది.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

కేసీఆర్ ఇవేమి తెలుసుకోకుండానే మోడీని ఢీకొట్టేందుకు సిద్ధ‌మ‌య్యాడా ? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

Advertisement

తాజా వార్తలు