మునుగోడు ప్రచారానికి సీఎం కేసీఆర్..!

మునుగోడు ఉపఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నుంచి సీఎం కేసీఆరే నేరుగా మునుగోడు వార్ లోకి దిగుతున్నారు.ప్రచార బాధ్యతలను ఇప్పటికే 14 మంది మంత్రులకు, 72 మంది ప్రజాప్రతినిధులకు అప్పగించిన విషయం తెలిసిందే.

వీరితో పాటు సీఎం కేసీఆర్ సైతం ప్రచారం చేసేందుకు సిద్ధమైయ్యారు.ఈ క్రమంలోనే ఆయన ప్రచారానికి లెంకలపల్లిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

అయితే, లెంకలపల్లి పంచాయతీ కాంగ్రెస్ కంచుకోటగా ఉంది.గత సర్పంచ్ ఎన్నికల్లో 10 వార్డుల్లో 8 గెలుచుకుంది.

Advertisement

కాగా ఈనెలాఖరులో చండూరులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.దీనికి సీపీఎం, సీపీఐ నేతలు హాజరుకానున్నారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement