పులివెందులలో సీఎం జగన్ నామినేషన్..!

ఏపీ సీఎం జగన్( AP CM Jagan) పులివెందుల వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేశారు.

ఈ మేరకు కడప జిల్లా పులివెందుల రిటర్నింగ్ అధికారికి సీఎం జగన్ నామినేషన్ పత్రాలను అందజేశారు.

జగన్ నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు భారీగా తరలివచ్చారు.ఈ క్రమంలో జై జగన్ నినాదాలతో విధులు మార్మోగాయి.

నామినేషన్ వేయడానికి ముందు పులివెందులలోని సీఎస్ఐ గ్రౌండ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు.నామినేషన్ వేసిన జగన్ ముందుగా కడప ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు.

అక్కడి నుంచి గన్నవరం( Gannavaram)కు చేరుకోనున్నారు.కాగా ఇవాళ్టితో నామినేషన్ల ఘట్టం ముగియనుంది.

Advertisement

ఈ నెల 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది.

రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది.అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 చివరి తేదీ.

వచ్చే నెల 13న పోలింగ్ జరగనుండగా.జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఏఎన్నార్ ఒత్తిడితో మెగాస్టార్ సినిమా వదిలేసిన కోదండరామిరెడ్డి
Advertisement