మాండుస్ తుఫాన్ నేపథ్యంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

మాండుస్ తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలియజేయడం జరిగింది.ఈ క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి.

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ జిల్లాలలో తుఫాను ప్రభావం గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.

CM Jagan's Key Orders In The Wake Of Typhoon Mandus CM Jagan, Typhoon Mandus , N

ఈ క్రమంలో అన్ని రకాల చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల కలెక్టర్ లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.

పునరావాసాలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఇదిలా ఉంటే మాండుస్ తుఫాన్ ప్రభావం కారణంగా వైఎస్ఆర్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

ఈ నేపథ్యంలో పరమతమైన అధికారులు.కడప కలెక్టరేట్, బద్వేల్, జమ్మలమడుగు, పులివెందుల RDO ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.

కడప -08562-246344, 08562-295990, జమ్మలమడుగు -9440767485, బద్వేల్- 9182160052, పులివెందుల-739167368 నెంబర్లను అందుబాటులో ఉంచడం జరిగింది.ఇదే సమయంలో పాపాగ్ని నది తీరం వైపు వెళ్లకుండా ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు