గృహ నిర్మాణశాఖ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు..!

ఏపీలోని గృహ నిర్మాణశాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా కాలనీల్లో మౌలిక సదుపాయాలపై అధికారులు పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలని సీఎం జగన్ తెలిపారు.ఈ క్రమంలోనే ఎక్కడ ఏ సమస్యను గుర్తించినా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

నిర్మాణాలు పూర్తి చేసుకున్న ప్రతి ఇంటికి తగిన సదుపాయాలు ఉన్నాయా? లేదా ? అన్న దానిపై ఆడిట్ నిర్వహించాలని సూచించారు.ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటివరకు 12,72,143 మంది అక్కాచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రూ.35 వేల చొప్పున రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు.ఇప్పటివరకూ తీసుకున్న రుణాలపై వడ్డీ డబ్బుల విడుదలకు సన్నద్ధం కావాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

అలాగే టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం జగన్ లబ్దిదారులతో ఏర్పాటు చేసిన అసోసియేషన్లు సమర్థవంతంగా పని చేసేలా వారికి తగిన అవగాహన కల్పించాలని తెలిపారు.

Advertisement
శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?

తాజా వార్తలు