CM Jagan Bus Yatra : ఎల్లుండి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర

త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏపీలోని పార్టీలన్నీ ప్రచారానికి సన్నద్ధం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఎల్లుండి నుంచి వైసీపీ ( YCP ) ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది.

ఈ మేరకు సీఎం జగన్ బస్సు యాత్రను( CM Jagan Bus Yatra ) ప్రారంభించనున్నారు.మేమంతా సిద్ధం పేరుతో ఏపీ వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది.

కాగా ఈ బస్సు యాత్ర కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు నిర్వహించనున్నారు.ఈ మేరకు ఎల్లుండి ఇడుపులపాయంలో దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్న సీఎం జగన్ ప్రార్థనలు నిర్వహించనున్నారు.

అనంతరం మేమంతా సిద్దం యాత్రను( Memantha Siddham Yatra ) ఆయన ప్రారంభించనున్నారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు