AP CM Jagan : రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్..!

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఈ మేరకు రేపటి నుంచి ‘ మేమంతా సిద్ధం( Memantha Siddham )’ పేరుతో వైసీపీ బస్సు యాత్రకు సిద్ధం అయ్యారు.

ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి వైసీపీ బస్సు యాత్ర ప్రారంభంకానుంది.ఇచ్చాపురం వరకు సాగనున్న సీఎం జగన్ యాత్ర మొత్తం 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగనుంది.

Cm Jagan Will Start Election Campaign From Tomorrow

రేపు యాత్రను ప్రారంభించనున్న సీఎం జగన్ ముందుగా ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు.అక్కడి నుంచి ఆళ్లగడ్డకు చేరుకోనున్న ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు.కాగా ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకు సీఎం జగన్ ప్రజాక్షేత్రంలోనే ఉండనున్నారు.

ఈ క్రమంలోనే ప్రతి రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశం అవుతారు.సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.

Advertisement
Cm Jagan Will Start Election Campaign From Tomorrow-AP CM Jagan : రేపట�
ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు.. ప్రభాస్ కు మాత్రమే ఎలా సాధ్యమవుతుంది?

తాజా వార్తలు