రేపు విశాఖకు సీఎం జగన్..

ఏపీ సీఎం జగన్ రేపు విశాఖకు వెళ్లనున్నారు.పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

రేపు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరి 10.30 గంటలకు విశాఖ చేరుకోనున్నారు.ముందుగా శారదా పీఠానికి వెళ్లనున్న జగన్ .అక్కడ పీఠం వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ నుంచి అనకాపల్లి ఎంపీ సత్యవతి కుమారుడు యశ్వంత్, స్రవంతి దంపతులను ఆశీర్వదించనున్నారు.

అనంతరం మధ్యాహ్నం విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి వెళ్లనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.అనంతరం సీఎం జగన్ తాడేపల్లికి తిరుగు పయనం అవుతారు.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు