ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

మూడవరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో సీఎం జగన్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు సంతోషంగా ఉండటం చంద్రబాబుకి ఇష్టం ఉండదని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఏ మంచి జరిగినా చంద్రబాబు అండ్ కో, దుష్ట చతుష్టయం ఏడుస్తున్నారు.పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదివితే ఏడుపే, వికేంద్రీకరణ చేస్తామన్న ఏడుపే.

ఆఖరికి రాష్ట్రంలో వర్షాలు పడి బాగా పంటలు వండుతున్న గాని ఏడుస్తున్నారు.

అలాంటి ప్రతిపక్షంతో మనం కాపురం చేస్తున్నామని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల విషయంలో చంద్రబాబు.రాకుండా అడ్డుకుంటున్నారని కూడా సీఎం జగన్ ఆరోపించారు.

Advertisement

 ప్రజలు బాధగా ఉంటే ఆనందించే వ్యక్తి చంద్రబాబు, ప్రజలు సంతోషంగా ఉంటే ఏడ్చే వ్యక్తి చంద్రబాబు.ఈ విషయం మూడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలు చూస్తున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని జగన్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు