నేటితో ముగియనున్న సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..!

ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) ఇవాళ్టితో ముగియనుంది.

ఈ మేరకు టెక్కలి నియోజకవర్గంలోని అక్కవరంలో జరిగే భారీ బహిరంగ సభతో యాత్ర ముగుస్తుంది.

శ్రీకాకుళం జిల్లాలోని అక్కివలస నుంచి సీఎం జగన్( CM YS Jagan ) బస్సు యాత్ర ప్రారంభం కానుంది.ఇవాళ ఎచ్చెర్ల, టెక్కలి నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగనుంది.

Cm Jagan Memantha Siddham Bus Yatra Ends Today..!,Memantha Siddham Bus Yatra,CM

కాగా అక్కివలస నుంచి మొదలుకానున్న బస్సు యాత్ర చిలకపాలెం జంక్షన్, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం టౌన్ బైపాస్ మీదుగా కోటబొమ్మాళి మీదుగా యాత్ర సాగనుంది.మధ్యాహ్నం 12 గంటలకు పరుశురాంపురం జంక్షన్ వద్ద సీఎం జగన్ లంచ్ బ్రేక్ తీసుకోనున్నారు.

తరువాత టెక్కలి నియోజకవర్గం( Tekkali Constituency )లోని అక్కవరంకు బస్సు యాత్ర చేరుకోనుంది.ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు అక్కవరంలో జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Advertisement

కాగా సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ భారీగా జనసమీకరణ చేస్తుంది.మరోవైపు యాత్ర ముగిసిన తరువాత సీఎం జగన్ విజయవాడకు వెళ్లనున్నారు.

చిరంజీవిని బలవంతం చేసినందుకు మంచి ఫలితమే దక్కింది..
Advertisement

తాజా వార్తలు