వైసీపీ నాలుగో జాబితాపై సీఎం జగన్ కసరత్తు..!!

ఏపీలోని వైసీపీలో కీలక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా వైసీపీ నాలుగో జాబితాపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు.మంత్రి అంబటి రాంబాబు, బియ్యపు మధుసూదన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డితో పాటు మానుగుంట మహిధర్ రెడ్డి క్యాంపు ఆఫీస్ కు వెళ్లారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల పార్టీ ఇంఛార్జుల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.అదేవిధంగా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, మధుసూదన్ యాదవ్ తో చర్చించారని సమాచారం.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable
Advertisement