చంద్రబాబుపై సీఎం జగన్ హాట్ కామెంట్స్

టీడీపీ చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.టీడీపీ మేనిఫెస్టోపై స్పందించిన ఆయన చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టిందని తెలిపారు.

అసలు మేనిఫెస్టో ఎలా తయారు చేస్తారో చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు.బీజేపీ, కాంగ్రెస్ హామీలను కలిపేసి మేనిఫెస్టో తెచ్చారన్నారు.

ఆకర్షణీయంగా ఉండవని మన పథకాలను కాపీ కొట్టారని విమర్శించారన్నారు.కానీ చివరికి చంద్రబాబు పథకాలే కాపీ, మోసమని తెలిపారు.

చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరని చెప్పారు.చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, జిత్తులు, ఎత్తులు, కుయుక్తులు అని ఎద్దేవా చేశారు.

Advertisement

పొత్తుల కోసం ఎంతవరకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు.

Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!
Advertisement

తాజా వార్తలు