ఏపీలోనూ ' హైడ్రా ' ? అమలు దిశగా చంద్రబాబు అడుగులు 

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా ( HYDRA ) అక్కడ పెను ప్రకంపనలే సృష్టిస్తోంది.

చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేస్తూ హైడ్రా ముందుకు వెళ్తోంది .

నిబంధనలకు విరుద్ధంగా చెరువులను కుంటలను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చి వేస్తున్నారు.ఈ విషయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గకుండా హైడ్రా ముందుకు వెళ్తోంది.

  హైడ్రా కూల్చివేతలలో ఎంతోమంది పేరున్న రాజకీయ నేతలు,  కాంగ్రెస్ ప్రభుత్వంలో( Congress Government ) కీలకంగా ఉన్నవారి భవనాలు,  ఫామ్ హౌస్ లో ఉన్నా అవేమి పట్టించుకోవడం లేదు.హైదరాబాద్ నగరాన్ని వరద ముంపు నుంచి రక్షించడంతో పాటు, భూగర్భ జలాలు అడుగంటి పోకుండా చూడడమే లక్ష్యంగా హైడ్రా ముందుకు వెళ్తోంది.

దీంతో హైడ్రా తరహా చట్టం పై ఎక్కువ ప్రశంసలే వస్తున్నాయి.

Advertisement

ఈ తరహా విధానాన్ని ఏపీలోనూ( AP ) ప్రవేశపెట్టాలని గత కొద్దిరోజులుగా డిమాండ్ వస్తూనే ఉంది .అయితే ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలకు( Vijayawada Floods ) భారీగా ఆస్తి , ప్రాణ నష్టం సంభవించడంతో ఏపీలోను హైడ్రా చట్టాన్ని తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో,  టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) సైతం హైడ్రా తరహా చట్టాన్ని అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం.  తాజాగా వరదలు,  వర్షాలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు  హైడ్రా పై కీలక వ్యాఖ్యలు చేశారు.

బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే కారణమని భావిస్తున్న చంద్రబాబు హైడ్రా పై ఫోకస్ చేశారు.  హైడ్రా తరహా చట్టం తీసుకువచ్చి బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు.

కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు.ప్రస్తుతం వరదలు,  వర్షాలు ఎక్కువగా ఉండడంతో అవి తగ్గుముఖం పట్టిన తరువాత హైడ్రా తరహా చట్టాన్ని ఏపీలో  ప్రవేశ పెట్టేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట.అయితే ఈ చట్టాన్ని కేవలం విజయవాడ నగరం వరకే పరిమితం చేస్తారా లేక రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

హైడ్రా తరహా చట్టం ఏపీలోనూ తీసుకొస్తే,  ఏపీలోనూ ఈ చట్టం రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు.

ధనవంతులకు ఆ బ్రిటీష్ యూనివర్సిటీ స్ట్రాంగ్ వార్నింగ్..?
Advertisement

తాజా వార్తలు