వైసీపీ పై బాబు ఫోకస్.. రాజీనామా బాటలో మరికొంతమంది ?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక ,  కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన వైసీపీని మరింతగా దెబ్బతీసేందుకు టిడిపి , జనసేన , బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది .

ఇప్పటికే అనేకమంది పేరున్న నేతలను పార్టీలో చేర్చుకున్నారు.

  ఇంకా అనేకమంది నేతలు టిడిపి,  జనసేన, బిజెపిలలో చేరేందుకు సిద్ధమవుతున్నారు .ఇప్పటికే కొంతమంది రాజ్యసభ సభ్యులు , ఎమ్మెల్సీలు పార్టీకి,  తమ పదవులకు రాజీనామా చేయగా,  మరికొంతమంది అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా అందుతున్న సంకేతాలు వైసీపీలో కలవరం పుట్టిస్తున్నాయి.వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు.

  దీని కారణంగానే కేంద్రంలో ఉన్న బిజెపి ,వైసిపి విషయంలో కొంత సానుకూల వైఖరి అవలంబిస్తూ వస్తోంది .దీంతో ఢిల్లీ స్థాయిలో వైసీపీ ప్రభావం బాగా తగ్గించాలనే ఆలోచనకు వచ్చిన కూటమి పార్టీలు ఆపరేషన్ వైఫ్సిపిని ప్రారంభించినట్లుగా అర్థం అవుతుంది.

Cm Chandra Babu Naidu S Focus On Ycp.. Some Others On The Path Of Resignation ,

 ముఖ్యంగా ఈ విషయంలో టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు .రాజ్యసభలో వైసిపి బలాన్ని బాగా తగ్గించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు.అందుకే ఆ పార్టీ నుంచి వలసలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు.

Advertisement
CM Chandra Babu Naidu S Focus On YCP.. Some Others On The Path Of Resignation ,

  అయితే అలా వచ్చి చేరిన నేతలతో నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు ఏర్పడతాయని, అంతర్గత కుమ్ములాటలు మొదలవుతాయనే భయము అందరిలోనూ ఉంది .అయితే వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని , అందుకే బలమైన నేతలను ముందుగా పార్టీలో చేర్చుకుని వారికి టికెట్ హామీని సైతం ముందుగానే ఇవ్వనున్నట్టు సమాచారం.కాకపోతే నామినేటెడ్ పోస్టులు విషయంలో మాత్రం వైసీపీ నుంచి వచ్చి చేరిన వారికి కాకుండా,  ముందు నుంచి పార్టీలో కష్టపడిన వారికే పదవులు ఇవ్వాలని భావిస్తున్నారట

Cm Chandra Babu Naidu S Focus On Ycp.. Some Others On The Path Of Resignation ,

ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు,  ఇద్దరు రాజ్యసభ సభ్యులు వైసీపీకి తమ పదవులకు రాజీనామా చేశారు.రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ,( Mopidevi Venkataramana ) బీదా మస్తాన్ రావు తో పాటు,  ఎమ్మెల్సీలు పోతుల సునీత , బల్లి కళ్యాణ చక్రవర్తి,  కర్రి పద్మశ్రీ రాజీనామా చేశారు.ఇంకా అనేకమంది రాజీనామా చేసి టిడిపి, జనసేన , బిజెపిలలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు