హైదరాబాద్ లో ముగిసిన సీఎల్పీ సమావేశం

హైదరాబాద్ లో ఏర్పాటైన సీఎల్పీ సమావేశం ముగిసింది.గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఎల్లా హోటల్ లో సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు.ఇందులో భాగంగా ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకులు అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ పరిశీలకులు సీఎల్పీ నేత ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగించారు.సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఈ క్రమంలో మరో రెండు గంటల్లో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం వెల్లడించనుంది.

Advertisement
ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు