హాట్ హాట్ గా సీఎల్పీ మీటింగ్... అసలేమైందంటే?

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుండి మొదలు కానున్న విషయం తెలిసిందే.

ఈ సందర్బంగా బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పట్ల సీఎల్పీ నేతలు సమావేశమైన సంగతి తెలిసిందే.

అయితే ఈ సమావేశానికి జగ్గారెడ్డి, సీతక్క లాంటి ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.అయితే అంతా సజావుగా సాగుతున్నదని భావిస్తున్న తరుణంలో జగ్గారెడ్డి సమావేశం ముగియకముందే బయటికి రావడం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ సమావేశం నుండి జగ్గారెడ్డి బయటికి రావడానికి ప్రధాన కారణం పార్టీ అంతర్గత విషయాలను జగ్గారెడ్డి ప్రస్థావించే ప్రయత్నం చేయడంతో భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేయడం, పార్టీ అంతర్గత విషయాలను ఈ సమావేశంలో ప్రస్తావించకూడదని చెప్పడంతో ఇక అసహనం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి సమావేశం నుండి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.అలాగే సరైన కారణాలు బయటికి రాకపోయినా సీతక్క కూడా సమావేశం నుండి బయటికి వచ్చినట్టు తెలుస్తోంది.

అయితే జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం తరువాత జరిగిన కాంగ్రెస్ తొలి సమావేశం కావడంతో జగ్గారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా కాంగ్రెస్ లో పరిస్థితులు అత్యంత ప్రతిష్టాత్మక బడ్జెట్ సమావేశం ముందుకూడా చర్చనీయాంశంగా మారడం అనేది కాంగ్రెస్ శ్రేణులను కాస్త నిరాశకు గురి చేసిందని చెప్పవచ్చు.అయితే ఈ విషయం టీఆర్ఎస్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

Advertisement

ఎందుకంటే కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను కూడా చాలా వ్యంగ్యంగా కెసీఆర్ సభలో  విమర్శించే అవకాశం ఉంది.నేటి ఘటనపై జగ్గారెడ్డి స్పందిస్తారా లేదా అనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేక పోయినా పరిణామాలను బట్టి మాత్రమే కాంగ్రెస్ లోని పరిస్థితులను మనం కాస్త అవగాహన చేసుకోవచ్చు.

మరి కాంగ్రెస్ లో ఈ తరహా పరిణామాలకు ఎప్పుడు పులిస్టాప్ పడుతుందనేది చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు