ప్రజా సమస్యలపై ప్రభుత్వాని నిలదియ్యటమే పీపుల్స్ మార్చ్ లక్ష్యం :సీఎల్పీ నేత భట్టి

రేషన్ షాపుల ద్వారా అమ్మహస్తం పథకం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం 9 సరుకులు పంపిణీ చేస్తే టిఆర్ఎస్ పాలకులు కేవలం బియ్యం ఇస్తూ సంక్షేమాన్ని అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.

రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం హామీ అమలు కావడం లేదని దుయ్యబట్టారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర సంపద పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న టిఆర్ఎస్ సర్కార్ పేదలకు నిత్యవసర వస్తువులను ఎందుకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు.రాష్ట్ర సంపద పెరిగినప్పుడు గతంలో 9 సరుకులు ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలు 18 సరుకులు ఇవ్వాల్సింది పోయి దీనికి భిన్నంగా ఉన్న సరుకులను బందు చేయడం ప్రజా సంక్షేమం ఎట్లా అవుతుందని అని నిలదీశారు.

పారదర్శకత పేరిట బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చి పేదలకు బియ్యం పంపిణీ కూడా దూరం చేసే కుట్రలు చేస్తున్న ఈ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నానని వివరించారు.డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని ప్రకటించిన టిఆర్ఎస్ ప్రభుత్వం హౌసింగ్ శాఖను ఎత్తివేసిందన్నారు.

ఎనిమిదేళ్లుగా డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎంత మందికి పంపిణీ చేశారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కూలినాలి పనులతో కాయకష్టం చేసి పిజి, ఇంజనీరింగ్ చదివించిన పిల్లలకు ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగాలు రాకపోవడంతో.

Advertisement

ఉన్నత చదువులు చదివిన పిల్లలు సుతారి పనులకు వెళుతుడటం చూసి తల్లిదండ్రులు మానసికంగా కృంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొలువులు ఇవ్వని సర్కారుపై కొట్లాడటమే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర లక్ష్యమని ఆయన వెల్లడించారు.

నవభారత నిర్మాత ప్రధాని నెహ్రూ అనేక ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా నిర్మించారని వివరించారు.వాటి ద్వారా పారే నీటితో పండించిన ధాన్యంతో గత 75 సంవత్సరాలుగా దేశంలో ఆకలి చావులు లేకుండా ఉన్న విషయాన్ని ఇప్పటి పాలకులు మర్చిపోవద్దని సూచించారు.తినటానికి తిండి లేక ఆకలి చావులతో అలమటించచిన దేశంలో ఇప్పుడు ఆహారధాన్యాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులే కారణమన్నారు.

పంటలు పండించడం రైతుల హక్కు అని, రైతులు పండించిన పంటలను కొనాల్సి బాధ్యత సర్కారుదని స్పష్టం చేశారు.రాచరిక వ్యవస్థలో కూడా మార్కెట్లు ఉండేవన్నారు.కానీ ఇప్పుడు వరి వేస్తే ఉరి అనడం సరైంది కాదు అని వివరించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రాజ్యం తిరిగి వస్తుందని అన్నారు.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు