నిఖిల్ 'స్పై' రిలీజ్ పై మరోసారి క్లారిటీ.. రూమర్స్ కు చెక్ పడినట్టేనా?

నిఖిల్ సిద్ధార్థ్( Nikhil Siddharth ) ఇప్పుడు ప్రత్యేక పరిచయం లేని పాన్ ఇండియన్ హీరో.సాధారణ హీరో నుండి పాన్ ఇండియా హీరోగా అవతరించాడు.

అందుకు నిఖిల్ శ్రమ అంతా ఇంతా కాదు.నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో( Karthikeya 2 movie ) బ్లాక్ బస్టర్ విజయం అందుకుని సృష్టించిన సంచలనం అందరికి తెలిసిందే.

ఎలాంటి ఆర్బాటం లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా హిందీలో కూడా మాసివ్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇక కార్తికేయ 2 సినిమా తర్వాత వెంటనే మళ్ళీ 18 పేజెస్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇలా వరుసగా రెండు హిట్స్ అందుకుని యంగ్ హీరోల్లోనే తిరుగులేని సక్సెస్ ట్రాక్ ను మైంటైన్ చేస్తున్నాడు.ప్రస్తుతం నిఖిల్ పాన్ ఇండియా వ్యాప్తంగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పై( SPY Movie ).యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవలే టీజర్ తో పాటు ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేసారు.ఈ రెండు అప్డేట్స్ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

Advertisement

ఈ సినిమాను జూన్ 29న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.కానీ తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం ఈ సినిమా నిర్మాతకు, నిఖిల్ కు మధ్య చిన్న క్లాష్( A small clash between the producer of the spy movie and Nikhil ) వచ్చిందని.

అందుకే సినిమా రిలీజ్ అవుతుందో లేదో డౌటే అన్నట్టు పలు వార్తలు షికార్లు చేసాయి.మరి మేకర్స్ ఈ రూమర్స్ కు చెక్ పెట్టారు.

ముందుగా అనౌన్స్ చేసినట్టే జూన్ 29నే ఈ సినిమా రిలీజ్ కాబోతుందని క్లారిటీ ఇచ్చేసారు.ఈ సినిమా యూఎస్ లో జూన్ 28న ప్రీమియర్స్ పడనున్నాయని కన్ఫర్మ్ చేసారు.అలాగే యూఎస్ లో ఏకంగా 450కి పైగానే లొకేషన్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా ఈ రూమర్స్ అన్నిటికి చెక్ పడినట్టే అయ్యింది.

ఇక ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.ఆర్యన్ రాజేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

చూడాలి నిఖిల్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడో లేదో.

Advertisement

తాజా వార్తలు