ఫేక్ ప్రచారం పై ఏపీ ప్రభుత్వం సీరియస్ ? ఆమెకు సిఐడి నోటీసులు ?

గత కొంత కాలంగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి .

  జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా, పథకాలకు నిధుల కొరత ఏర్పడకుండా జగన్ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.అయితే ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నిలిచిపోయాయని, వాటిని అమలు చేయలేక జగన్ ప్రభుత్వం చేతులెత్తేసింది అని సోషల్ మీడియా తో పాటు,  టిడిపి , జనసేన,  బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి.

అయితే ప్రభుత్వం  పథకాలను ఆపలేదు అని , ఇదంతా ఫేక్ ప్రచారం అంటూ ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తున్నా, ఈ తరహా ప్రచారాలు రోజురోజుకు ఉధృతి అవుతుండడం పై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా పై పోలీసులు ప్రత్యేకంగా నిఘాను  పెంచారు .ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేక్ పోస్టులు పెడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న వారి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు,  శ్రీకాకుళం జిల్లా కు చెందిన గౌతు శిరీష కు  సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

అమ్మ ఒడి,  వాహనమిత్ర పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందని లబ్ధిదారులకు ఈ ఏడాది రెండు పథకాలు అందవు అంటూ ప్రభుత్వ చిహ్నంతో ఉన్న ఓ నకిలీ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై  ఆమెకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. 

Advertisement

రేపు ఉదయం 10 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావలసిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు.గౌతు శిరీష కాకుండా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు ముఖ్య అనుచరుడు, టెక్కలి నియోజకవర్గ ఐ టీడీపీ  కోఆర్డినేటర్ వెంకటేష్ ను నాలుగు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన్ను విచారించారు.

తాజాగా గౌతు శిరీష కు నోటీసులు జారీ కావడంతో  ఈ నోటీసుల వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశం గా మారింది. .

Advertisement

తాజా వార్తలు