కోబ్రా ప్రమోషన్స్.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోల అల్లరి.. వైరల్!

కోలీవుడ్ హీరో విక్రమ్ తాజాగా నటించిన సినిమా కోబ్రా.ఇందులో హీరో విక్రమ్ మరొకసారి తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్, ట్రైలర్‌ లతో అంచనాలు పెంచేశారు.ఇక మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ క్రమంలోనే చిత్ర బంధం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్ లో ఒక ఇంటర్వ్యూలో విక్రమ్ తో పాటు మరొక ముగ్గురు హీరోయిన్లు కూడా పాల్గొన్నారు.ఇందులోనే హీరోయిన్ లు హీరో విక్రమ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలోనే హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ ఉండగా.హీరో విక్రమ్ స్టేజ్ మీద నుంచి లేచి వెళ్లబోయాడు.

Advertisement

అయితే విక్రమ్ తన గురించి గొప్పగా చెబుతుండటంతో విక్రమ్ అలా చేశాడు.ఆ తరువాత శ్రీనిధి విక్రమ్‌ ను పొగడ్తలతో ముంచెత్తింది.

హీరో విక్రమ్‌ ఎంతో హంబుల్‌ గా ఉంటారు.కాగా హీరో విక్రమ్ ఇప్పుడు ఉన్నట్టు గానే ఎంతో చలాకీగా, సరదాగా ఉంటాడు.

చిన్న పిల్లాడిలా ఉంటారు.మా మీద ఎన్నో ఫన్నీ ప్రాంక్‌లు చేస్తుంటారు అని చెప్పుకొచ్చింది శ్రీనిధి శెట్టి.

అనంతరం మరొక హీరోయిన్ మృణాళిని రవి మాట్లాడుతూ.హీరో విక్రమ్ సార్ అంటే ఎంతో భయపడ్డాను.ఎంతో సీరియస్‌ గా ఉంటారని అనుకొని వెళ్లాను.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

కానీ సెట్స్ మీద ఆయన ఆటలు ఆడుతూ ఎంతో సరదాగా ఉంటారు.ఇక ఆయన ఎప్పుడూ ఎనర్జీగానే ఉంటారు.

Advertisement

ఆ ఎనర్జీని మనం మ్యాచ్ చేయలేం అని చెప్పుకొచ్చింది మృణాలిని.ఆ తరువాత హీరోయిన్ మీనాక్షి మాట్లాడుతూ.

విక్రమ్ సర్ తన జోకులతో అందరినీ నవ్వించేస్తారు.షాట్ రెడీ అవ్వగానే.

మేం నవ్వుతూనే ఉంటాం.కానీ ఆయన మాత్రం రెడీగా ఉంటారు.

డైరెక్టర్‌కు మేం దొరికిపోయే వాళ్లము అని చెప్పుకొచ్చింది మీనాక్షి.

తాజా వార్తలు