చిరు తల్లికి అస్వస్థత.... స్పందించిన మెగా టీమ్ ఏమన్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) తల్లి అంజనా దేవి ( Anjana Devi ) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఇలా అంజనమ్మ శుక్రవారం ఉదయం ఉన్నఫలంగా అస్వస్థతకు గురి కావడంతో తన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించాలని ప్రస్తుతం ఆమె డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

ఇలా తన తల్లికి అనారోగ్యం చేయటంతో వెంటనే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) విజయవాడలో తన కార్యక్రమాలు అన్నింటిని కూడా వాయిదా వేసుకుని వెళ్లారని దుబాయ్ లో ఉన్న చిరంజీవి కూడా ఇండియాకు బయలుదేరారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియడం లేదు.చిరంజీవి తల్లి( Chiranjeevi Mother ) అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో చిరంజీవి టీం స్పందించారు.

Chiru Team React And Gives Clarity About Anjanadevi Health Update Details,anjana

చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఈ వార్తలను ఖండించారు.ఆమె ఆరోగ్య సమస్యల గురించి వస్తున్న వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు.అయితే నేడు ఉదయం అంజనా దేవి గారిని హాస్పిటల్ కి జనరల్ చెకప్ కోసం మాత్రమే తీసుకువెళ్లామని ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించి అనంతరం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించినట్లు వెల్లడించారు.

ఇలా ఆమె జనరల్ చెకప్ కోసమే హాస్పిటల్ వెళ్లారని చిరు టీం తెలియజేయడంతో మెగా అభిమానులు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Chiru Team React And Gives Clarity About Anjanadevi Health Update Details,anjana
Advertisement
Chiru Team React And Gives Clarity About Anjanadevi Health Update Details,Anjana

ఇక ఇటీవలే అంజనా దేవి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే స్వయంగా రాంచరణ్ చిరంజీవి దగ్గరుండి మరి ఆమె పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా చిరు సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.

చలికాలం పొడిచర్మం ఇబ్బందా ? ఈ సలహాలు చూడండి
Advertisement

తాజా వార్తలు