గాడ్ ఫాదర్ లేటెస్ట్ అప్డేట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్న సినిమాల్లో గాడ్ ఫాథర్ ఒకటి.

మరొక వారం రోజుల్లో దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అందరు అటెన్షన్ నెలకొనింది.

ఆచార్య ప్లాప్ తర్వాత ఈ సినిమాతో మెగాస్టార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అందుకే ఈ సినిమా విషయంలో అంతా కూడా ఆతృతగా ఉన్నారు.

ఈ సినిమా అయినా ఆచార్య ప్లాప్ ను మరిపించేలా హిట్ అవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మరి రిలీజ్ కు చిన్న గ్యాప్ ఉండడంతో అన్ని వైపులా నుండి ఈ సినిమా ప్రొమోషన్స్ చేస్తున్నారు.

ఎప్పటి నుండో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే అఫిషియల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ప్రకటించారు మేకర్స్.

Advertisement

గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 28న జరగనుండగా..

వెన్యూ ను అనంతపురం లోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో జరగనుంది.ఈ ఈవెంట్ కోసం మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలి రాబోతున్నారు.

ఈ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తారో అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా కొత్త ఎలిమెంట్స్ తో చేయనున్నారని.

అలాగే ఈ సినిమాకు గెస్ట్ గా ఎవరు రావడం లేదని తెలుస్తుంది.మెగా ఫ్యామిలీ నుండి కూడా ఒక్క హీరో కూడా రావడం లేదని.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

కేవలం చిత్ర యూనిట్ తో పాటు ఇతర దర్శకులు, నిర్మాతలు కనిపించే అవకాశం ఉంది అని తెలుస్తుంది.చూడాలి ఏం జరుగుతుందో.

Advertisement

ఇక తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుంటే.సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించాడు.

థమన్ సంగీతం అందించాడు..

తాజా వార్తలు