'భోళా శంకర్' రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్.. ఎప్పుడు రిలీజ్ కాబోతుందంటే?

మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి బ్రేక్స్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ కు వరుసగా ట్రీట్ ఇస్తున్నాడు.

ఈ మధ్యన చిరు వరుసగా గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు హిట్స్ వెంటవెంటనే అందుకున్నాడు.

ఇక ఈ సినిమాల తర్వాత వెంటనే మరో సినిమాను రిలీజ్ చేసేందుకు మెగాస్టార్ సన్నాహాలు చేస్తున్నాడు.మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా భోళా శంకర్.

ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.

Advertisement

మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్ గా తెరకెక్కుతుంది.

రీమేక్ సినిమా అయినా కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మెహర్ రమేష్ సాలిడ్ మాస్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై అదిరిపోయే అప్డేట్ వస్తుంది.

తాజాగా ఈ సినిమా రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతుంది.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది.ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ఫిక్స్ చేయగా అది మెల్లగా ఒక్కో నెల మారుతూ వస్తుంది.

మన చేతి రేఖలలో మార్పులు జరుగుతాయా... ఈ మార్పు దేనికి సంకేతం?

ఫైనల్ గా ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

Advertisement

తాజా వార్తలు