చిరు 150వ సినిమా కథ కాపీనా??

చిరంజీవి 150వ సినిమా గురించి నిన్ననే కధ అధికారిక ప్రకటన వచ్చింది.అప్పుడు ఆ సినిమా వివాదంలో చిక్కుకుంది.

చిరంజీవి 150వ సినిమా కోసం బివిఎస్‌ రవి స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు.ఇప్పుడు ఆ కథే వివాదాస్పదం అవుతోంది.

చిరంజీవి నటించబోతున్న సినిమా స్క్రిప్ట్‌ను రవి ఒక వర్ధమాన రచయిత రూపొందించిన కథ నుండి కాపీ కొట్టినట్లుగా ప్రముఖ ఇంగ్లీష్‌ దిన పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.ఏకంగా ఇంగ్లీష్‌ ప్రతికలోనే ఈ వార్త ప్రముఖంగా రావడంతో చిరు 150వ సినిమా కథ వివాదం పెద్దగానే మారింది.

వాసుదేవ్‌ వర్మ అనే రచయిత ఈ కథను రూపొందించాడట.ప్రభాస్‌ కోసం ఈ కథను కృష్ణం రాజుకు పలు సార్లు వినిపించడం జరిగిందట.

Advertisement

అయితే స్క్రిప్ట్‌లో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేవు అంటూ కృష్ణం రాజు తిరష్కరించినట్లుగా తెలుస్తోంది.ఆ తర్వాత ఈ కథను ప్రముఖ రచయిత అయిన గోపీ మోహన్‌తో వాసుదేవ్‌ చర్చించడం జరిగింది.

ఇదే కథను గోపీ మోహన్‌ మరో రచయిత అయిన బివిఎస్‌ రవితో చర్చించాడు.ఆ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి చిరంజీవి 150వ సినిమా కోసం రెడీ చేశాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సినిమా విషయంలో ఇలా అవ్వడం విచారకరం అంటూ మెగా ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తన కథను సినిమా తీస్తే ఊరుకునేది లేదు అంటూ వాసుదేవ్‌ వర్మ హెచ్చరిస్తున్నాడు.

మరి ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఆసక్తికర విషయంగా ఉంది.ఈ సినిమాకు పూరి దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే.

హీరోయిన్లతో అఫైర్స్.. హీరోలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భార్యలు..
Advertisement