150 కోట్ల క్లబ్ లో 'వీరయ్య'.. మెగాస్టార్ మాస్ రచ్చ ఇప్పట్లో తగ్గేలా లేదుగా!

మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

సరైన మాస్ సినిమా సరైన సమయంలో రిలీజ్ చేస్తే ఇప్పటికి మెగాస్టార్ స్టామినా ఎంత మాత్రం తగ్గలేదు అని నిరూపించాడు.

దాదాపు 30 ఏళ్ల తర్వాత మెగాస్టార్ తన ఎనర్జీని, మాస్ యాటిట్యూడ్ ను బయటకు తీయడంతో మెగా ఫ్యాన్స్ ను వాల్తేరు వీరయ్య సినిమా బాగా అలరిస్తుంది.జనవరి 13న సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరించాడు.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ ను సైతం మెప్పించింది.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటించాడు.

చిరు, మెగాస్టార్ కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

Advertisement

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తుంది.ఇక ఈ సినిమా ఫస్ట్ నుండి చివరి వరకు ఫుల్ కామెడీతో కథ నడవడంతో ప్రేక్షకులకు అప్పుడే సినిమా అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చేసింది.ఇంతలా ఈ సినిమా అలరించడంతో సంక్రాంతి సెలవలు పూర్తి అయ్యాక కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది.

ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

ఇక ఇప్పుడు 150 కోట్ల గ్రాస్ ను కూడా క్రాస్ చేసింది.టాలీవుడ్ లోనే 150 కోట్లు దాటిన సినిమాల జాబితాలో వాల్తేరు వీరయ్య చేరిపోయింది అనే చెప్పాలి.ఏది ఏమైనా మంచి మాస్ సినిమా పడితే మెగాస్టార్ ను బీట్ చేసే వారు లేరు అనే కామెంట్స్ మళ్ళీ వినిపిస్తున్నాయి.

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మెగాస్టార్ సినిమా ఈ రేంజ్ లో హిట్ అవ్వడం ఇదే తొలిసారి.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?
Advertisement

తాజా వార్తలు