ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడింది : మెగాస్టార్

ఏపీ లో సినిమా టికెట్ల ధరల విషయం రోజురోజుకూ వివాదంగా మారి ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ రచ్చ రచ్చ చేసారు.

టికెట్ ధరలను భారీగా తగ్గించడంతో అసలు వివాదం స్టార్ట్ అయ్యింది.

టికెట్ రేట్ లను తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఈ విషయంపై సినీ సెలెబ్రిటీలు ముందు నుండి సంతృప్తిగా లేరు.

ఈ విషయంపై సినీ పెద్దలు ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.కానీ ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం స్పందించలేదు.

కానీ తాజాగా జగన్ సర్కారు సినీ పెద్దలతో భేటీ అవ్వాలని నిర్ణయించుకుని ఈ రోజు భేటీ అయ్యింది.జగన్ తో పాటు సినీ పెద్దలుగా చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, కొరటాల శివ హాజరయ్యారు.

Advertisement
Chiranjeevi Speech After Meeting With AP CM Jagan , AP CM Jagan , Chiranjeevi ,

ఎన్టీఆర్ కు ఆహ్వానం అందినా కూడా ఆయన హాజరు కాలేదు.ఇక సీఎం జగన్ తో టాలీవుడ్ బృందం భేటీ ముగిసింది.

ఈ రోజు ఉదయం స్టార్ట్ అయిన ఈ భేటీ కొద్దీ సేపటి క్రితమే ముగిసింది.చిరంజీవి నేతృత్వం లోని బృందం సినిమా టికెట్ ధరలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చలు జరిపారు.

సీఎం జగన్ కు సినీ పరిశ్రమ నుండి 14 విజ్ఞప్తులు చేసినట్టు జగన్ కూడా వాటికి సానుకూలంగా స్పందించినట్టు తెలియజేసారు.ఈ భేటీ తర్వాత చిరంజీవి ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

Chiranjeevi Speech After Meeting With Ap Cm Jagan , Ap Cm Jagan , Chiranjeevi ,

ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము.చిన్న సినిమాలకు ఐదవ షోకు అంగీకారం తెలిపారు.తెలంగాణ లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినట్టుగానే ఆంధ్ర లోను అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

రెండు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని వారికి చెప్పడం జరిగింది.ఈ రోజు సహృద్భావంగా ఈ చర్చ ముగిసింది.దానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రికి, పేర్ని నానికి, అలాగే న్యాయబద్ధంగా ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చినందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు అంటూ చిరంజీవి ముగించారు.

Advertisement

తాజా వార్తలు