ఖైదీని మించిన ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం యావత్ మెగా ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించేందుకు చిరు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాలో చిరుకు సొంతమైన డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయా లేవా అనే సందేహం పలువురిలో నెలకొంది.

కాగా చిరు నటించిన ఖైదీ నెంబర్ 150లో చిరుతో కలిసి చరణ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి.ఇప్పుడు ఆచార్య చిత్రంలో కూడా చిరు-చరణ్‌లు కలిసి కళ్లు చెదిరే స్టె్ప్స్ వేసేందుకు రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాల టాక్.

Advertisement

ఓ పాటలో వీరిద్దరు కలిసి చేసే డ్యాన్స్‌కు థియేటర్ల టాప్ లేవాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.పక్కా కమర్షియల్ అంశాలతో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఆచార్య చిత్రంపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో చిరు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.వేసవి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాతో మెగాస్టార్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఈ సినిమాను నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

మధుమేహం ముప్పు ఎలా పెరిగిపోతున్న‌దంటే...
Advertisement

తాజా వార్తలు