Chiranjeevi Waltair Veerayya : వాల్తేరు వీరయ్య' రిలీజ్ డేట్ పై పెరిగిన ఆసక్తి.. మరి ప్రకటన ఎప్పుడు?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆచార్య ప్లాప్ ను మరిపించే విధంగా హిట్ అందుకున్నాడు.

దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు మరో పెద్ద పండుగకు సినిమాను రెడీ చేస్తున్నాడు.మెగా ఫ్యాన్స్ కూడా నెక్స్ట్ రిలీజ్ కాబోయే సినిమా మీద మరింత ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

ప్రెజెంట్ చిరంజీవి చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ దాదాపు పూర్తి అయ్యింది.

ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.ఈ సినిమాలో చిరు మాత్రమే కాదు మాస్ రాజా రవితేజ కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నాడు.

Advertisement

మెగాస్టార్ తమ్ముడు రోల్ లో రవితేజ నటిస్తున్నట్టు తెలుస్తుంది.చాలా రోజుల తర్వాత చిరు, రవితేజ కాంబోలో సినిమా రాబోతుండడంతో మరింత ఆసక్తిగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.అయితే డేట్ మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు.ఈ సినిమా సంక్రాంతి మూడు రోజుల్లో ఎప్పుడు రాబోతుందో అని అంతా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే సంక్రాంతి రేస్ లో ఉన్న అన్ని సినిమాల రిలీజ్ డేట్ లు కన్ఫర్మ్ అయ్యాయి.దీంతో ఈ సినిమా మాత్రమే రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది.

అందుకే ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా సోలో రిలీజ్ గానే ఉంటుంది అని టాక్ వస్తుంది.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

దీనిపై అధికారిక అప్డేట్ వస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.