మెగాస్టార్‌కు ఆ డైరెక్టర్ పడుంటేనా.. లెక్కే వేరుగా ఉండేది!

మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి రీసెంట్‌గా సైరా నరసింహారెడ్డితో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో తన 152వ చిత్రానికి రెడీ అవుతున్నాడు చిరు.

ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరికొత్త గెటప్‌లో మనకు కనిపిస్తాడనేది టాక్.అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం కొరటాల శివ బదలుగా చిరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేసుంటే ఆ లెక్క వేరుగా ఉండేదని అంటున్నారు.

తాజాగా అల వైకుంఠపురములో సినిమాతో బన్నీకి అదిరిపోయే హిట్ ఇచ్చిన త్రివిక్రమ్, పవన్‌కు అత్తారింటికి దారేది వంటి బిగ్గెస్ట్ హిట్‌ను అందించాడు.దీంతో చిరంజీవి కూడా త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేసుంటే అది ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అయ్యేదని వారు అంటున్నారు.

మరి మెగా ఫ్యాన్స్ కోరికను చిరు తన నెక్ట్స్ మూవీ తరువాతైనా ఆలకిస్తాడా లేడా అనేది చూడాలి.ఇప్పటికైతే త్రివిక్రమ్ మెగా కాంపౌండ్‌కు అచ్చొచ్చిన డైరెక్టర్‌గా మారాడు.ఇక తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్, మెగా కాంపౌండ్‌లో ఎవరికి అవకాశం ఇస్తాడో చూడాలి.

Advertisement
ర‌క్త‌హీన‌త‌, ఎముక‌ల బ‌ల‌హీన‌త‌ను త‌రిమికొట్టే సూప‌ర్ డ్రింక్ ఇదే!

తాజా వార్తలు