సునీతా విలియమ్స్ ప్రయాణంపై చిరు ఎమోషనల్ కామెంట్స్.. అలా రియాక్ట్ అవుతూ?

సునీత విలియమ్స్( Sunitha Williams ).గత కొద్ది రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మారుమోగుతున్న విషయం తెలిసిందే.

దాదాపు తొమ్మిది నెలల నిరీక్షణ తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ( Butch Wilmore )సురక్షితంగా భూమికి చేరుకోబోతున్న విషయం తెలిసిందే.దీంతో వీరికి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నారు.

ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే.సునీత విలియమ్స్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు పోస్టులు కూడా చేస్తున్నారు.అందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Tollywood megastar Chiranjeevi ) సైతం సునీత విలియమ్స్ కు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు.ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశారు మెగాస్టార్ చిరంజీవి.

Advertisement

ఈ సందర్భంగా మెగాస్టార్ ట్వీట్ చేస్తూ.పుడమికి తిరిగి స్వాగతం సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌.ఇది చారిత్రక ఘట్టం.8 రోజుల్లో తిరిగి రావాలని వెళ్లి 286 రోజుల తర్వాత భూమికి చేరుకున్నారు.ఆశ్చర్యకరమైన రీతిలో 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు.

మీరు గొప్ప ధైర్యవంతులు.మీకు ఎవరూ సాటిలేరు.మీ ప్రయాణం ఒక థ్రిల్లర్‌ అడ్వెంచర్‌ మూవీని తలపిస్తోంది.

ఇది గొప్ప సాహసం.నిజమైన బ్లాక్‌బస్టర్‌ అని రాసుకొచ్చారు చిరంజీవి.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే దీర్ఘ నిరీక్షణ తర్వాత సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు తాజాగా బుధవారం తెల్లవారు జామున 3:27 నిమిషాలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర తీరాన దిగిన విషయం తెలిసిందే.స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డయాగ్రమ్ ఫ్రీడం వారిని సురక్షితంగా భూమికి తీసుకువచ్చింది.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు