Chiranjeevi : అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి.. చిరంజీవి ప్లాన్స్ అన్ని బెడిసి కొట్టాయిగా !

అనుకున్నదొక్కటి అయినది ఒకటి బోల్తా పడ్డావులే బుల్ బుల్ పిట్ట.ఈ పాట వింటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) అందరికీ గుర్తొస్తారు.

ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే రెండు మూడు ఏళ్లు పడుతుంటే తాను మాత్రం త్వర త్వరగా చిత్రాలు చేస్తానని ప్రేక్షకులకు మాటిచ్చాడు.అందుకే పోయిన ఏడాది కంకణం కట్టుకొని మరి ఆచార్య, బోలా శంకర్, వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ వంటి సినిమాలను అతి తక్కువ టైం గ్యాప్ లో విడుదల చేసాడు.

ఈ నాలుగు చిత్రాల్లో ఒక్క వాల్తేరు వీరయ్య ( Waltair Veerayya )మాత్రమే హిట్ అందుకుంది.దాంతో స్పీడ్ గా సినిమాలు తీయడం ముఖ్యం కాదు.

కథ బాగుంటే తప్ప ఆడదు అని అర్థమయిపోయింది.ఇక రీమేక్ సినిమాల విషయానికి పోకూడదనే విషయం కూడా క్లారిటీ వచ్చేసింది చిరంజీవికి.

Chiranjeevi Plans Are Not Working Out
Advertisement
Chiranjeevi Plans Are Not Working Out-Chiranjeevi : అనుకున్నద

అందుకే ఇక రీమేక్స్ కథలు కాకుండా సొంత కథలతోనే ముందుకు వెళ్లాలని ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడు.మరోవైపు 2024 కి చిరంజీవి నుంచి ఒక్క సినిమా కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.ఒక వైపు ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న వశిష్ట సినిమా( Mallidi Vasishta ) 2025 సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధమవుతుండగా, కళ్యాణ్ కృష్ణ( Kalyan Krishna ) అని ప్రస్తుతానికి చిరంజీవి హోల్డ్ చేసినట్టుగా తెలుస్తోంది.

దీంతో చిరంజీవి సినిమాలకు ప్రస్తుతం బ్రేక్ పడింది అనుకోవచ్చు.ఇలా సినిమాలు ఫ్లాప్ అవుతుంటే ఒకదాని తర్వాత ఒకటి చిరంజీవి లో ఒక రకమైన అప్సెట్ మొదలైంది అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Chiranjeevi Plans Are Not Working Out

చాలా తక్కువ మంది హీరోలు వరుస సినిమాలు చేసి విజయాలు అందుకుంటారు.కానీ మెగాస్టార్ లాంటి ఒక స్టార్ హీరో వరస పెట్టి ఏడాదిలో నాలుగు సినిమాలు విడుదల చేయడం అనేది అంత చిన్న విషయం ఏమీ కాదు.అలా చేసే క్రమంలో ఒక్కోసారి ఒక్కో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.

దానితో ఓ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అందుకే ఈ సారి ఎలాంటి పొరపాట్లు చేయకుండా టైం తీసుకున్న పర్వాలేదు కానీ మంచి సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలనే చిరంజీవి గట్టి నిర్ణయం తీసుకున్నారట.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

సో మెగా ఫాన్స్ లెట్స్ వెయిట్ ఫర్ వన్ మోర్ ఇయర్.

Advertisement

తాజా వార్తలు